రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన తెలంగాణ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మొదట అక్టోబర్ 27న రూ.కోటి డిమాండ్ చేస్తూ ఓ మెయిల్ వచ్చింది. అనంతరం రూ.400 కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపేస్తానంటూ నిందితుడు ముఖేష్ అంబానీని బెదిరించాడు
పలుమార్లు మెయిల్స్ రావడంతో వెంటనే ముఖేష్ అంబానీ సబ్బంది పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించగా.. అంబానీ ని బెదిరింపులకు గురి చేసిన యువకుడు తెలంగాణ రాష్ట్రా నికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఈ కేసులో తెలంగాణకు చెందిన గణేష్(19) అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తెలంగాణ నుంచి అరెస్టు చేశామని.. అనంతరం కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. కోర్టు అతడిని నవంబర్ 8 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.