2021 ఏప్రిల్ నెలలో బెస్ట్ సెల్లింగ్ కార్ ఇదేనట..!

Maruti Suzuki Wagon R Leads The Chart With Over 18,600 Units. కరోనా కాలంలో ఆటోమొబైల్ రంగం కూడా కుదేలైందన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  8 May 2021 10:40 AM GMT
2021 ఏప్రిల్ నెలలో బెస్ట్ సెల్లింగ్ కార్ ఇదేనట..!

కరోనా కాలంలో ఆటోమొబైల్ రంగం కూడా కుదేలైందన్న సంగతి తెలిసిందే..! ఇక ఏప్రిల్ నెలలో కార్లను కొనుక్కోడానికి కూడా వినియోగదారులు పెద్దగా ఆసక్తిని చూపించలేదని తెలుస్తోంది. ఇక మారుతీ సుజుకీకి చెందిన 'వేగనార్ ఆర్' మోడల్ కారు బెస్ట్ సెల్లింగ్ కార్ గా నిలిచిందని JATO డైనమిక్స్ ఇండియా సంస్థ తెలిపింది. అత్యధికంగా అమ్ముడైన కార్ల లిస్టులో టాప్ లో మారుతి సుజుకీ ఇండియా, హ్యుండై మోటార్ ఇండియా కంపెనీలకు చెందినవే ఉండడం విశేషం. మారుతీ సుజుకీకి చెందిన 7 మోడల్స్ కార్లు, హ్యుండైకు చెందిన మూడు కార్లు ఏప్రిల్ నెలలో టాప్ సెల్లింగ్ కార్స్ లిస్టులో ఉన్నాయి. మారుతీ సుజుకీకి చెందిన వ్యాగనార్ ఆర్, స్విఫ్ట్, ఆల్టో, బలెనొ, డిజైర్, ఈకో, విటారా బ్రీజా మోడళ్ళు, హ్యుండై కు చెందిన క్రెటా, గ్రాండ్ 10 ఎన్ఐఓఎస్, వెన్యూ కార్లు ఎక్కువగా భారతీయులు కొన్నారని తాజా సర్వేలో తేలింది. JATO డైనమిక్స్ ఇండియా ప్రకారం ఈ మోడల్స్ కార్లను ఎక్కువగా కొనడానికి ఇష్టపడ్డారు.. కొత్తగా కొన్న కార్లలో ఇవే 50శాతం ఉన్నాయని తెలిపారు.

ఏప్రిల్ 2021 కు సంబంధించి బెస్ట్ సెల్లింగ్ కార్ గా మారుతి సుజుకి వాగనార్ ఆర్ నిలిచింది. ఈ మోడల్ యూనిట్లు 18656 వరకూ సేల్ అయ్యాయి. మార్చి నెలలో మొదటి స్థానంలో ఉన్న స్విఫ్ట్ రెండో స్థానానికి చేరుకుంది. స్విఫ్ట్ కార్లు 18316 యూనిట్లు అమ్ముడుపోగా.. ఆల్టో యూనిట్లు 17303 వరకూ అమ్ముడుపోవడంతో మూడో స్థానంలోకి ఎగబాకింది.

బలెనొ మార్చి నెలలో రెండో స్థానంలో ఉండగా.. ఏప్రిల్ నెలలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ కారు 16384 యూనిట్లు అమ్ముడుపోయింది. మారుతి సుజుకి డిజైర్ 14,073 యూనిట్స్ అమ్ముడుపోయింది. హ్యుండై క్రెటా 12,483 యూనిట్లు అమ్ముడుపోయాయి.హ్యుండై గ్రాండ్ i10 Nios 11,540 యూనిట్లు అమ్ముడుపోయింది. మారుతి సుజుకి ఈకో వ్యాన్ 11,469 యూనిట్లు అమ్ముడుపోగా.. హ్యుండై వెన్యూ 11,245 యూనిట్లు అమ్ముడుపోయింది. మారుతి సుజుకి వితారా బ్రిజా 11,220 యూనిట్లు అమ్మారు.


Next Story