గుంటూరులో 'లైఫ్‌స్టైల్' స్టోర్ ప్రారంభం

lifestyle showroom opened New store in guntur. భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే ఫ్యాషన్‌ స్టోర్‌గా లైఫ్‌స్టైల్ కు పేరుంది

By Medi Samrat  Published on  20 May 2022 1:15 PM GMT
గుంటూరులో లైఫ్‌స్టైల్ స్టోర్ ప్రారంభం

భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే ఫ్యాషన్‌ స్టోర్‌గా లైఫ్‌స్టైల్ కు పేరుంది. ఈ క్ర‌మంలోనే లైఫ్‌స్టైల్ గుంటూరులో నూతన స్టోర్‌ను ప్రారంభించింది. న‌గ‌రంలోని లక్ష్మీపురం రోడ్డు ఎన్‌టీఆర్‌ స్టేడియం పక్కన శుక్ర‌వారం ఈ స్టోర్‌ను ప్రారంభించింది. దాదాపు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక స్టోర్ రూపుదిద్దుకుంది.

ఈ స్టోర్‌ ప్రారంభోత్సవంలో గుంటూరు నుంచి పలువురు వీఐపీలు పాల్గొన్నారు. ప్రారంభం రోజే వినియోగ‌దార్ల‌ నుంచి అపూర్వమైన స్పందనను అందుకుంది. అత్యధిక శాతం వినియోగదారులు స్టోర్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫోటోబూత్‌ వద్ద చిత్రాలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన ఈ ఫోటోబూత్‌లో ఫోటో దిగిన వారికి తక్షణమే ఫోటోను ఫోటోఫ్రేమ్‌లో అందించారు.

ఈ స్టోర్ లో విస్తృత శ్రేణి ఫ్యాషన్‌ బ్రాండ్లు, లైఫ్‌స్టైల్‌ ఫ్యాషనబల్‌ ఫోర్ట్‌ఫోలియో బ్రాండ్లు అయినటువంటి మెలాంజ్‌, కప్పా, కోడ్‌, ఫోర్కా, జింజర్‌, బొస్సినీ, ఫేమ్‌ ఫరెవర్‌ మరెన్నో అందుబాటులో ఉన్నాయి. అదనంగా సరికొత్త వేసవి కలెక్షన్‌ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. లైఫ్‌స్టైల్‌ 30% తగ్గింపుతో గుంటూరు షాపర్లకు ప్రారంభ ఆప‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్‌ కేవలం మూడు రోజుల పాటు అంటే మే 20 నుంచి మే 22, 2022 వరకూ లభిస్తుంది.

లైఫ్‌స్టైల్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో lifestylestores.com ద్వారా అందుబాటులో ఉంది. దీనిద్వారా వినియోగదారులు తమ ఇంటి నుంచి అత్యంత సౌకర్యవంతంగా కొనుగోళ్లు చేయవచ్చు. వేగవంతమైన షాపింగ్‌ అనుభవాలను అందించేందుకు లైఫ్‌స్టైల్‌ యాప్ కూడా ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది.Next Story