శుభవార్త.. నేటి నుంచే హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గింపు
గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
శుభవార్త.. నేటి నుంచే హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గింపు
గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. హోం లోన్స్‌పై వడ్డీ రేటును తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ ప్రకటించింది. ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేటును 0.50 శాతం తగ్గించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల ప్రకటించిన రెపో రేటు తగ్గింపునకు అనుగుణంగా ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొత్తగా గృహ రుణం తీసుకునే వారికే కాకుండా, ఇప్పటికే రుణం తీసుకున్న వారి నెలవారీ చెల్లింపుల భారం కూడా కొంతమేర తగ్గనుంది.
దీనివల్ల కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికే కాకుండా ఇప్పటికే రుణం తీసుకున్న వారికి సైతం నెలవారీ చెల్లింపుల భారం కొంత తక్కువ కానుంది. తమ ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునేవారికి ఇది ఒక సంతోషకరమైన వార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, UCO బ్యాంకులు ఇప్పటికే లోన్స్ తీసుకున్న, కొత్త వారికి రేట్లను తగ్గించాయి. ప్రస్తుతం HDFC, ICICI బ్యాంక్ వంటి రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు మాత్రమే తమ రేట్లను తగ్గించలేదు.
వడ్డీ రేటు తగ్గడం వల్ల ఈఎంఐ చెల్లింపుల్లో కొంత భారం తగ్గుతుంది. ఉదాహరణకు, 20 లక్షల రూపాయల రుణాన్ని 20 సంవత్సరాల కాలానికి తీసుకుంటే, వడ్డీ రేటు 0.50 శాతం తగ్గడం వల్ల నెలవారీ ఈఎంఐ సుమారు వెయ్యి రూపాయల వరకు తగ్గుతుంది. రుణ మొత్తం పెరిగే కొద్దీ ఈఎంఐ తగ్గింపు కూడా పెరుగుతుంది. గృహ రుణం తీసుకోవాలనుకునేవారు, లేదా ఇప్పటికే రుణం పొందిన వారు పూర్తి సమాచారం కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా సమీపంలోని బ్యాంకును సంప్రదించవచ్చు.