బిజినెస్‌ పెట్టాలనుకునే మహిళలకు గుడ్‌న్యూస్‌.. రూ.5 కోట్ల ప్రభుత్వ సాయం

నేటి ఆధునిక సమాజంలో పురుషులకు ఏమాత్రం తగ్గకుండా, వారితో సమానంగా అన్నింటిలో ముందుంటున్నారు స్త్రీలు.

By అంజి  Published on  19 Nov 2024 1:53 AM GMT
government, women , business , SISF scheme, National news

బిజినెస్‌ పెట్టాలనుకునే మహిళలకు గుడ్‌న్యూస్‌.. రూ.5 కోట్ల ప్రభుత్వ సాయం..

నేటి ఆధునిక సమాజంలో పురుషులకు ఏమాత్రం తగ్గకుండా, వారితో సమానంగా అన్నింటిలో ముందుంటున్నారు స్త్రీలు. పురుషులతో పాటు మహిళలు కూడా కొన్ని సంస్థలకు ముందుండి వ్యవస్థాపకులుగా తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. కొత్తగా బిజినెస్‌ పెట్టాలనుకునే మహిళలకు ప్రభుత్వాలు కూడా సాయం చేస్తున్నాయి. మహిళలు ప్రారంభించే కొత్త స్టార్టప్‌లకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించింది.

తాజాగా భారత ఆర్థిక సలహాదారు ఆర్తీ భట్నాగర్.. స్టార్టప్‌లు తమ బిజినెస్‌ను ఇంకా డెవలప్‌ చేసుకునేందుకు రూ. 5 కోట్ల వరకు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం కింద మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు సపోర్ట్‌ ఇవ్వడానికి ప్రతి ఇంక్యుబేటర్‌కు రూ. 5 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం నిధుల గురించి మాత్రమే కాదని, మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన వనరులు సమకూర్చడం, వారి వెంచర్‌లను అభివృద్ధి చేయడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. వివిధ అవసరాల కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడానికి రూ. 945 కోట్లతో DPIIT స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రకటించారు. ఇది కొత్తగా ప్రారంభించిన స్టార్టప్‌లు లేదా వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో పోటీపడే దశకు మద్దతు కల్పించడానికి వీలు కల్పిస్తుంది.

ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌ ఇప్పటికే 300 ఇంక్యుబేటర్ల ద్వారా 3,600 మంది పారిశ్రామికవేత్తలకు సపోర్ట్‌ చేస్తోంది. ఈ స్కీమ్‌ 2021లో ప్రారంభించబడింది. ఈ ఫండ్ పొందాలనుకునే వారు ప్రభుత్వ వెబ్‌సైట్ seedfund.startupindia.gov.inలో అప్లికేషన్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే టైంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లు మేనేజ్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ పూల్స్‌గా ఉంటాయి. ఇవి డెవలప్‌ అయిన స్టార్టప్‌లు, ఇతర ప్రారంభ దశ కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. ఇవి సాధారణంగా గుర్తింపు పొందిన పెట్టుబడిదారులకు మాత్రమే అమల్లో ఉంటాయి.

Next Story