యూజర్లకు గూగుల్ పే షాకింగ్ న్యూస్

Google Pay Shock To Users. న‌గ‌దు లావాదేవీల యాప్ అయిన‌ గూగుల్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.

By Medi Samrat  Published on  25 Nov 2020 9:30 AM GMT
యూజర్లకు గూగుల్ పే షాకింగ్ న్యూస్

న‌గ‌దు లావాదేవీల యాప్ అయిన‌ గూగుల్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభ‌ జనవరి మాసం నుండి గూగుల్ పే వెబ్​యాప్ సేవలు నిలివేయనున్నట్లు తెలిపింది. అలాగే గూగుల్ పే నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకు గాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ పే వినియోగదారులు ఇప్పటి వరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్ ను ఉపయోగించే వారు.

తాజా ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. 2021 ప్రారంభం నుండి.. మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.comను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్ ను ఉపయోగించండని కంపెనీ సమాచారం ఇచ్చింది. దీంతో గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​-టూ-పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నిలిపేసేందుకు సిద్ధమైంది.

ఇక మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. ఇటీవలే ఐఓఎస్​​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను కూడా పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది.


Next Story