ఓటీటీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఉచితంగా నెట్‌ప్లిక్స్.. చిన్న ట్విస్ట్ ఉందండోయ్..!
Good News For OTT Users. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతపడడంతో.. లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకులు ఓటీటీ వైపు
By Medi Samrat Published on 21 Nov 2020 12:22 PM ISTకరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతపడడంతో.. లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకులు ఓటీటీ వైపు మొగ్గుచూపారు. దీంతో ఓటీటీలు కూడా తమ సబ్‌స్ర్కైబర్లను పెంచుకునేందుకు పోటీపడుతున్నాయి. ముందు వరుసలో అమెజాన్ ప్రైమ్ ఉండగా.. ఇప్పుడు ఆహా కూడా కాస్త గట్టిగానే వినియోగదారులను పెంచుకునే పనిలో ఉంది. మిగతా ఓటీటీల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని మార్కెట్‌లో నిలదొక్కుకునేందు నెట్‌ప్లిక్స్ ఓ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. నెట్‌ప్లిక్స్‌లో ఉన్న కంటెంట్‌ను డబ్బులు చెల్లించకుండా ఉచితంగా చూడొచ్చని తెలిపింది. అయితే.. ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. అయితే.. అది కేవలం రెండు రోజుల మాత్రమేనని తెలిపింది.
డిసెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని నెట్‌ప్లిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో అభిమానులు ఉచితంగా సినిమాలు, వెబ్ సిరీసులు, భారతీయ భాషల్లో కంటెంట్‌ను చూడొచ్చని తెలిపింది. చందాదారులు కానివారు నెట్‌ప్లిక్స్‌లో వీక్షణ అనుభూతిని పొందేందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ఈ 48 గంటల ఫెస్ట్‌ను డిసెంబర్ 5న తెల్లవారుజామున 12.01 నుండి డిసెంబర్ 6న రాత్రి 11.59 గంటలకు వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది నెట్‌ఫ్లిక్స్.
ఈ స్ట్రీమింగ్ ఫెస్ట్‌లో కంటెంట్‌ను వీక్షించడానికి మీరు మీ ఇమెయిల్ ఐడీ లేదా పేరు లేదా ఫోన్ నంబర్‌తో సైన్ అప్ చేసుకోవాలని ఆసంస్థ ఉపాధ్యక్షురాలు మోనికా షెర్గిల్ తెలిపారు. ఒకరి లాగిన్ సమాచారాన్ని మరొకరు ఉపయోగించుకునేందుకు వీల్లేదని చెప్పారు. లాగిన్ అయిన ఎవరైనా స్టాండర్డ్ డెఫినెషన్‌లో వీడియోలను వీక్షించొచ్చని వెల్లడించారు. ఇక తమకు ప్రపంచ వ్యాప్తంగా 195.19 మిలియన్ల చందాదారులు ఉన్నారని చెప్పుకొచ్చినా.. భారత్‌లో ఎంత మంది ఉన్నారో చెప్పలేదు.