స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver Rates. బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బంగారంపై రూ.10 తగ్గగా.. వెండిపై రూ.200 తగ్గింది.

By Medi Samrat  Published on  2 Aug 2021 6:25 AM GMT
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బంగారంపై రూ.10 తగ్గగా.. వెండిపై రూ.200 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.50 వేలకు దిగువన బంగారం ధర ఉండ‌గా.. వెండి ధర రూ.73,000 ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.44, 990 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,090గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. ఇక వెండి ధర విష‌యానికొస్తే నిన్న స్థిరంగా ఉండ‌గా.. గడిచిన ప‌ది రోజుల్లో ఐదు సార్లు తగ్గింది. మూడు సార్లు పెరిగి.. రెండుసార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభానికి ముందు కేజీ వెండి ధర రూ.73,000 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.200 తగ్గింది. ఏప్రిల్ 1న వెండి ధర కేజీ రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.73,000 ఉంది. ఈ 4 నెలల్లో వెండి ధర రూ.5,700 పెరిగింది.


Next Story