అంతర్జాతీయ కారణాల వల్ల ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో హైదరాబాద్‌లో బంగారం ధరలు శుక్రవారం మునుపెన్నడూ లేని స్థాయికి పెరిగాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,280కి చేరుకుంది. ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరగడం బంగారం ధరకు రెక్కలొచ్చాయని బులియన్ ట్రేడర్లు తెలిపారు.
సంవత్సరం ప్రారంభంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,500 ఉండగా.. 24-క్యారెట్ల బంగారం రూ. 78,000 ఉంది. ఈ ధరలు 42 శాతానికి పైగా పెరిగాయి. దేశవ్యాప్త ట్రెండ్‌లో భాగంగానే హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలలో గణనీయమైన పెరుగుదల ఉంది. హైదరాబాద్ మరియు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల భవిష్యత్తు దిశ.. ప్రధానంగా US ఫెడ్ రేట్లు, టారిఫ్ విధానాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై ఆధారపడి ఉంటుంది.