దేశంలోని హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో బంగారం ధరలు మరోసారి రూ.80,000 మార్క్‌ను దాటాయి. ఈరోజు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,070కి చేరుకుంది. ప్రస్తుత ధరలు నెల ప్రారంభంలో ఉన్న రేట్లతో పోలిస్తే 22 క్యారెట్, 24 క్యారెట్ల బంగారం ధరలలో 2.65 శాతం పెరుగుదల కనిపిస్తుంది. జనవరి ప్రారంభంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000గా ఉంది.
నేడు 22 క్యారెట్ల బంగారంపై రూ. 400, 24 క్యారెట్ల బంగారంపై రూ. 430 ధరలు పెరిగాయి. ఈ పెరుగుదలతో హైదరాబాద్‌లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ మరియు బెంగళూరుతో సహా ఇతర ప్రధాన భారతీయ నగరాలలో కూడా బంగారం ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది.