రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును యథాతథంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్‌తో పాటు ఇతర భారతీయ నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ 1 నుండి హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధర 380 తగ్గాయి. గత నెలలో బంగారం ధర 3 శాతానికి పైగా క్షీణించింది.
తాజా ధరలు ఇలా ఉన్నాయి:
22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 71,150
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,620
స్థిరత్వాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు బంగారం ప్రాధాన్య ఎంపికగా ఉన్నప్పటికీ.. మార్కెట్ హెచ్చుతగ్గులు, ఆర్థిక ధోరణులు దాని విలువను నిర్దేశిస్తాయి. బంగారం ధరలు తగ్గుదలతో హైదరాబాద్ వాసులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. అయితే.. భవిష్యత్తులో ధరల కదలికలు అనిశ్చితంగా ఉంటాయి. వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి.