బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్రకటన తర్వాత హైదరాబాద్‌లో బంగారం ధరలు నాలుగు శాతానికి పైగా తగ్గాయి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క రోజులో బంగారం ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ పెరుగుతుందని అంచనా.
బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తారని ఎప్పుడో తగ్గిస్తారని భావించినా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. తాజాగా తగ్గింపు ప్రకటన తర్వాత.. స్వల్పకాలంలో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నప్పటికీ.. భౌగోళిక రాజకీయ అస్థిరత ముప్పు ఇప్పటికీ ఉంది. దీని కారణంగా హైదరాబాద్‌తో సహా దేశంలోని నగరాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
జూలై 24 నాటికి నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 64,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,860. దిగుమతి సుంకం తగ్గింపు ప్రకటన తర్వాత 10 గ్రాములకు రూ.3,000 తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే జనాలు షాపుల మందు క్యూ కట్టే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి..!