రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు

బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈరోజు కొత్త రికార్డులు సృష్టించాయి

By Medi Samrat  Published on  16 Oct 2024 11:18 AM GMT
రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు

బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈరోజు కొత్త రికార్డులు సృష్టించాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్ర‌స్తుతం రూ.71,400 కాగా 24 క్యారెట్ల బంగారం రూ.77,890కి చేరుకుంది. హైదరాబాద్‌లో బంగారం ధరల పెరుగుదల అక్టోబర్‌లో ఇప్పటివరకూ 1 శాతానికి పైగా పెరిగింది. సెప్టెంబర్ 1న 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,500 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం రూ. 76,910 ఉంది. పెరిగిన ధ‌ర‌ల‌తో కేవలం ఒక నెలలోనే 1.27 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఈ రోజు మాత్రమే నగరంలో 22 క్యారెట్ల బంగారంపై ధ‌ర‌ రూ. 450, 24 క్యారెట్ల బంగారంపై ధ‌ర‌ రూ. 490 పెరిగింది.

బంగారం ధరల పెరుగుదల హైదరాబాద్‌కే పరిమితం కాదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,550 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధర ధ‌ర రూ.78,040 ఉంది. కోల్‌కతా లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,400 ఉండ‌గా.. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,890 ఉంది. ముంబై, చెన్నైల‌లో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,400 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,890 ఉంది.

Next Story