హైదరాబాద్‌లో మళ్లీ ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు

హైదరాబాద్‌లో బంగారం ధరలు మరోసారి రికార్డ్‌లు బ్రేక్ చేశాయి. నేడు 22 క్యారెట్ మరియు 24-క్యారెట్ ధరలు వరుసగా రూ. 1050, రూ. 1140 పెరిగాయి.

By Medi Samrat
Published on : 28 March 2025 3:05 PM IST

హైదరాబాద్‌లో మళ్లీ ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు

హైదరాబాద్‌లో బంగారం ధరలు మరోసారి రికార్డ్‌లు బ్రేక్ చేశాయి. నేడు 22 క్యారెట్ మరియు 24-క్యారెట్ ధరలు వరుసగా రూ. 1050, రూ. 1140 పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 10 గ్రాములకు రూ.12,980 పెరిగింది. ఈ రోజు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,980కి చేరుకుంది.

సంవత్సరం ప్రారంభంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,500, 24 క్యారెట్ల బంగారం రూ. 78,000 వద్ద ఉండ‌గా.. ప్ర‌స్తుతానికి 16 శాతం పెరిగి 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,980కి చేరుకున్నాయి.

దేశవ్యాప్త ట్రెండ్‌లో భాగంగానే హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు పెరిగాయి.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది. సురక్షితమైన పెట్టుబడిగా భావించ‌డం వ‌ల్ల‌ బంగారానికి డిమాండ్ ఎక్కువ‌. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితితో కలిపి, US అధ్యక్షుడు ట్రంప్ కొత్త టారిఫ్ బెదిరింపులు కూడా హైదరాబాద్, ఇతర నగరాల్లో రేట్ల పెరుగుదలకు ఆజ్యం పోసింది.

Next Story