మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు

Gold Rates Hiked. బంగారం కొనాల‌నుకునే వారికి షాకిస్తున్నాయి ధ‌ర‌లు. క‌రోనా కార‌ణంగా బంగారం ధ‌ర త‌గ్గుతుంద‌ని

By Medi Samrat  Published on  4 Jun 2021 10:50 AM IST
మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు

బంగారం కొనాల‌నుకునే వారికి షాకిస్తున్నాయి ధ‌ర‌లు. క‌రోనా కార‌ణంగా బంగారం ధ‌ర త‌గ్గుతుంద‌ని భావించ‌గా.. మ‌రింత పెరుగుతోంది. క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం.. కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు. తాజాగా 10 గ్రాములపై 100 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 50వేలకుపైగా ఉన్న‌ పసిడి.. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ హైదరాబాద్‌లో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద ట్రేడ్ అవుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ .47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,350 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,790 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,230 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,230 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,450 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,400 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది.


Next Story