మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు..!

Gold Rate Hike Today. బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ

By Medi Samrat  Published on  28 Jun 2021 9:04 AM IST
మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు..!

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. గ‌త కొద్ది రోజులుగా త‌గ్గుతున్న బంగారం ధ‌ర సోమ‌వారం స్వ‌ల్పంగా పెరిగింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం పై రూ. 20 పెరిగింది. పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,270 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,320 ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,470, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,510

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,170, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,170

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,680, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,120

-కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,120

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,120

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,120

కాగా.. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని తెలిపారు.




Next Story