ఆగని పెట్రో బాదుడు.. రెండు వారాల్లో పన్నెండోసారి.._

Fuel Price Hike. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్​పై 40 పైసల చొప్పున

By Medi Samrat  Published on  4 April 2022 3:58 AM GMT
ఆగని పెట్రో బాదుడు.. రెండు వారాల్లో పన్నెండోసారి.._

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్​పై 40 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా పెరుగుద‌ల‌తో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.41కు చేరుకుంది. డీజిల్ ధర రూ.95.07కు ఎగబాకింది. గ‌డిచిన‌ 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది 12వ సారి. ఈ ప‌న్నెండు రోజుల‌లో మొత్తంగా ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.8.40 మేర పెరిగింది.

ఇదిలావుంటే.. ముంబయిలో పెట్రోల్ ధర 42 పైసలు పెరిగి రూ.118.81కు ఎగబాకింది. డీజిల్ ధర 43 పైసలు పెరిగి రూ.103.05కు చేరుకుంది. చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.109.32కు చేరుకోగా.. డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ.99.4కు ఎగబాకింది. కోల్​కతాలో లీటర్ పెట్రోల్​పై 42 పైసలు, డీజిల్​పై 41పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.113.43గా ఉంది. డీజిల్ ధర రూ.98.21కి చేరింది.

హైదరాబాద్​లో పెట్రోల్ ధర రూ.117.68కు చేరుకుంది. డీజిల్ ధర రూ.103.75 కు చేరుకుంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ.119.51కు చేరింది. డీజిల్ ధర రూ.105.2 చేరింది. వైజాగ్​లో 44 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.118.23కు ఎగబాకింది. డీజిల్ ధర 41 పైసలు పెర‌గ‌డంతో రూ.103.95కు చేరింది.

Next Story