పండ‌గ పూట పెట్రో మంట‌.. మ‌రోమారు పెరిగిన ధ‌ర‌లు

Fuel Price Hike. మరోసారి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు

By Medi Samrat  Published on  15 Oct 2021 9:49 AM IST
పండ‌గ పూట పెట్రో మంట‌.. మ‌రోమారు పెరిగిన ధ‌ర‌లు

మరోసారి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత వారం రోజుల నుండి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కొద్ది రోజులపాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ మ‌ధ్య‌ మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో సామాన్య పౌరులకు పెట్రో ధరలు సమస్యగా మారాయి. చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.35 పైసలు, డీజిల్‌పై రూ.35 పైసలను చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో లీటర్‌ పెట్రోల్ రూ.112.04, డీజిల్ రూ.104.44కు పెరిగింది. ఇక విజయవాడలో లీటర్ పెట్రల్ రూ.112.04, డీజిల్ రూ.104.44కు చేరింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.37, డీజిల్ రూ.102.42కు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఢిల్లీలో పెట్రోల్ రూ.105.14, డీజిల్ ధర రూ. 93.87 చెన్నైలో పెట్రోల్ రూ.102.50, డీజిల్ ధర రూ.98.36 కోల్‌కతాలో పెట్రోల్ రూ.105.76, డీజిల్ ధర రూ.96.88 ముంబైలో పెట్రోల్ రూ.111.09, డీజిల్ ధర రూ.101.78.


Next Story