డిసెంబర్ 31 లోపు ఈ పనులు చేయండి.. లేదంటే..!
Financial tasks you should complete by 31 december . ఈ ఏడాది ముగింపుకు సమయం ఆసన్నమైంది. కొత్త ఏడాది రావడానికి, పాత ఏడాదికి ముగింపు పలకడానికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే
By అంజి Published on 27 Dec 2021 4:30 PM ISTఈ ఏడాది ముగింపుకు సమయం ఆసన్నమైంది. కొత్త ఏడాది రావడానికి, పాత ఏడాదికి ముగింపు పలకడానికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక అందరి ఇళ్లలో పాత క్యాలెండర్ స్థానంలో కొత్త క్యాలెండర్ రానుంది. అయితే ఈ ఏడాది ముగింపు లోపు ఆర్థిక విషయాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. డిసెంబర్ 31లోగా చేయాల్సిన పనుల గురించి తెలుసుకోండి.
మొదటిది జీవన ప్రమాణ పత్రం. పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సిన సమయం దగ్గర పడుతోంది. ప్రతి సంవత్సరం నవంబర్ 30 లోపు పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉండగా.. ఈసారి మాత్రం డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు జీవన ప్రమాణ పత్రం సమర్పించని పెన్షనర్లు.. వెంటనే సమర్పించాలి. లేదంటే పెన్షన్ విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పోస్టాఫీసు, బ్యాంకు, డోర్ స్టెప్, ఆన్‌లైన్ విధానంలో పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించ వచ్చు. ఇక రెండోది ఐటీఆర్ ఫైలింగ్. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలకు 4 రోజుల సమయం మాత్రమే ఉంది. కరోనా విజృంభణ, కొత్త ఆదాయపు పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అయితే నెల 31లోపు ఐటీ రిటర్నులు దాఖలు చేయకుంటే.. తర్వాత జరిమానాతో చెల్సించాల్సి వస్తుంది.
మూడోది ఆదార్, పీఎఫ్ లింక్. ఈపీఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్. ఆధార్‌ను పీఎఫ్ ఖాతాకు అనుసంధానం చేసేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఉంది. అనుసంధానం చేయకుంటే కాంట్రీబ్యూషన్ నిలిచిపోకుండా ఉంటుంది. నాలుగోది ఈపీఎఎఫ్‌వో ఈ-నామినేషన్ దాఖలకు గడువు డిసెంబర్ 31 మాత్రమే. ఈ లోపు ఈపీఎఫ్‌వో చందాదారులు ఈ-నామినేషన్‌ను పూర్తి చేయాలి. ఆన్‌లైన్‌లో పెన్షన్ క్లెయిమ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింకడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పొందడానికి ఈ -నామినేషన్ కావాల్సి ఉంటుంది.