మాంసాహార ప్రియులకు షాక్..ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్ ధరలు
మాంసాహారం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి.
By - Knakam Karthik |
మాంసాహార ప్రియులకు షాక్..ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్ ధరలు
మాంసాహారం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. చలికాల ప్రభావానికి తోడు, డిమాండ్ కూడా పెరగడం వల్ల హైదరాబాద్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ.310 వరకు చేరింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. విజయవాడలో రూ.290, గుంటూరు, వరంగల్‌లో రూ.300, విశాఖలో రూ.290, ఖమ్మంలో రూ.270-290, కామారెడ్డిలో రూ.280గా ఉన్నాయి. గుడ్ల ధరలు కూడా పెరిగాయి. ఒక్కోటి రూ.8 పలుకుతోంది. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది బర్డ్ ఫ్లూ భయాలతో చికెన్ ధరలు పతనమైన సంగతి తెలిసిందే. అప్పుడు గరిష్ఠంగా కిలో ధర రూ. 285 దాటలేదు. కానీ, డిసెంబర్ చివరి వారం నుంచి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్ 21న కిలో రూ. 240గా ఉన్న ధర, ఇప్పుడు రూ. 300కు చేరడం వినియోగదారుల జేబులకు భారంగా మారింది.
మరోవైపు, కోడిగుడ్డు ధర కూడా గత కొన్ని వారాలుగా రూ. 8.5 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. సంక్రాంతి వరకు చికెన్, గుడ్ల ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలతో చాలామంది చికెన్‌కు బదులుగా చేపలు వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు.