భారీగా పెరిగిన బిట్ కాయిన్ విలువ‌

Bitcoin, Ethereum, Dogecoin Gain Today. బిట్ కాయిన్ ల విలువ భారీగా పెరుగుతూ వెళుతోంది. గురువారం నుంచి శ‌నివారం

By Medi Samrat  Published on  5 Feb 2022 5:37 PM IST
భారీగా పెరిగిన బిట్ కాయిన్ విలువ‌

బిట్ కాయిన్ ల విలువ భారీగా పెరుగుతూ వెళుతోంది. గురువారం నుంచి శ‌నివారం వ‌ర‌కు బిట్ కాయిన్ విలువ 16శాతం మేర పెరిగింది. బిట్ కాయిన్‌తో పాటు బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీకి అనుసంధ‌న‌మైన ఈథ‌ర్ కాయిన్ విలువ కూడా పెరిగింది. బిట్ కాయిన్ విలువ శ‌నివారానికి 41,983 డాల‌ర్లుకు చేరుకోగా, ఈథ‌ర్ కాయిన్ విలువ 3 వేల డాల‌ర్ల‌కు చేరుకుంది. ఒక్క శుక్ర‌వారం రోజు ఏకంగా 11 శాతంమేర పెరిగింది. అమెరికా మార్కెట్లు ఈ వారం లాభాల బాట ప‌ట్ట‌డంతో బిట్‌కాయిన్ విలువ కూడా భారీగా పెరిగింది.

భార‌త్‌లో మాత్రం క్రిప్టో క‌రెన్సీ వినియోగంపై ఇంకా సందిగ్ధం కొన‌సాగుతోంది. క్రిప్టో క‌రెన్సీపై అప్ప‌ట్లో కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే క్రిప్టో క‌రెన్సీకి నిర్దిష్ట విలువ ఉండ‌ద‌ని వీటిపై ప్ర‌భుత్వాల అజమాయిషీ కూడా ఏది ఉండ‌ద‌న్న కార‌ణంతో ఈ డిజిట‌ల్ క‌రెన్సీని నిషేధించాల‌ని ఆ క‌మిటీ సూచించింది. ఈ సూచ‌న‌ల మేర‌కు ఆర్బీఐ 2018లో క్రిప్టో క‌రెన్సీని పూర్తిగా నిషేధించింది. అయితే 2020 మార్చిలో ఈ నిషేధాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక ఆర్బీఐ నియంత్ర‌ణ‌లో డిజిట‌ల్ రూపాయిని తీసుకొస్తున్న‌ట్లు ఇటీవల బడ్జెట్ ప్ర‌సంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. వ‌ర్చువ‌ల్, డిజిట‌ల్ ఆస్తుల‌పై వ‌చ్చే ఆదాయంపై30 శాతం ప‌న్ను విధించ‌నున్న‌ట్లు తెలిపారు.


Next Story