కారు కొనాలనుకుంటున్నారా..?.. ఈ నెలాఖరులోగా కొనండి..ఎందుకంటే..!
Best time to buy a car. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కొనుగోలుదారులకు షాకివ్వనుంది
By Medi Samrat Published on 23 March 2021 6:56 PM IST
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కొనుగోలుదారులకు షాకివ్వనుంది. ఏప్రిల్ నుంచి అన్ని రకాల మోడళ్లపై ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు, ఇన్‌ఫుట్ వ్యయాలు పెరగడంతో ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. దీంతో కారు కొనుగోలు చేసేవారిపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే ఎంత మేర ధరలు పెంచనుందో ప్రకటించలేదు. ఇప్పటిఏక ఈ ఏడాది జనవరిలో కొన్ని కార్ల ధరలను రూ.34 వేల వరకు పెంచింది. మొబిలిటీ, ఆటో మొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రోగ్రాం కింద మూడు కొత్త స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు మారుతీ సంస్థ వెల్లడించింది. అయితే మేజర్ వాహనాల ధరలను పెంచిన తర్వాత మార్చి 23న ఉదయం సెషనల్‌లో మారుతీ సుజుకీ ఇండియా షేర్‌లో ఒక శాతం పెరిగింది.
కాగా, ఫిబ్రవరిలో మారుతీ సుజుకీ 168,180 వాహనాలను ఉత్పత్తి చేసింది. అంతకు ముందు ఏడాది 140,833 యూనిట్లు ఉండేది. ఇందులో 1.65,783 ప్యాసింజర్ వాహనాలు, 2,397 లైట్ కమర్షియల్ యుటిలిటీ వాహనాలు ఉన్నాయి. ఇక అమ్మకాల్లో 2021 ఫిబ్రవరిలో 164,469 యూనిట్లను విక్రయించింది. అయితే గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.8శాతం ఎక్కువగా ఉంది. గత నెలలో 1,44,761 ప్యాసింజర్ వాహనాలు, 2,722 తేలికపాటి వాహనాలు, 5,500 వాహనాలు ఇతర ఓఈఎంలకు విక్రయించింది. 11,486 ఎగుమతి చేసిన యూనిట్లు ఉన్నాయి. అయితే ఏప్రిల్ నుంచి ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు చేసేవారు ఈ నెలాఖరులోపు తీసుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది.
Next Story