అల‌ర్ట్‌.. 3 రోజుల పాటు మూత‌ప‌డ‌నున్న‌ బ్యాంకులు

మార్చిలో చాలా పండుగలు ఉన్నాయి. అనేక ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

By Medi Samrat  Published on  6 March 2024 9:15 PM IST
అల‌ర్ట్‌.. 3 రోజుల పాటు మూత‌ప‌డ‌నున్న‌ బ్యాంకులు

మార్చిలో చాలా పండుగలు ఉన్నాయి. అనేక ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నెలలో శివరాత్రితో పాటు హోలీ ప్రత్యేక పండుగ ఉంటుంది. మహాశివరాత్రి 8 మార్చి 2024న, హోలీ మార్చి 25న. రెండు సందర్భాల్లోనూ బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే మార్చి ప్రారంభంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూత‌ప‌డ్డాయి. తదుపరి మూడు రోజులు కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

మీకు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పని ఉంటే.. వీలైనంత త్వరగా ఆ ప‌ని పూర్తి చేయాలనుకుంటే.. దానికి ఒక రోజు మాత్రమే ఉంది. అవును, బ్యాంక్ సంబంధిత పనిని పూర్తి చేయడానికి మీకు ఒక రోజు మాత్ర‌మే ఉంది. ఆ తర్వాత బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. బ్యాంకు సెలవులు గురించి తెలుసుకుందాం.

మహాశివరాత్రి శుక్రవారం(మార్చి 8) బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే మహాశివరాత్రి కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడవు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆ తర్వాత శని, ఆదివారాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రెండో శని, ఆదివారాల్లో బ్యాంకులు మూతపడతాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాల ప్రకారం.. రెండవ శనివారం, నాల్గవ శనివారం అన్ని బ్యాంకులకు సెలవులు. దీంతో రెండో శనివారం(మార్చి 9) సెలవు దినం. ఆదివారం(మార్చి 10) కూడా బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది. దీంతో వినియోగ‌దారులు గ‌మ‌నించాల్సిందిగా బ్యాంకులు అల‌ర్ట్ చేశాయి.

Next Story