ఏటీఎంలో డబ్బులు విత్ డ్రాలు చేస్తున్నారా.. జర సూసుకోండి
ATM cash withdrawal charges to increase from January 1st. వచ్చే నెల నుంచి బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే వారు అధిక చార్జీలు చెల్లించుకోవాల్సిందే.
By అంజి Published on 2 Dec 2021 6:39 PM ISTవచ్చే నెల నుంచి బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే వారు అధిక చార్జీలు చెల్లించుకోవాల్సిందే. ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత చార్జీలు బాదుడు ప్రారంభం కానుంది. దీనిపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇప్పటికే ఇందుకు అనుమతిని ఇచ్చింది. ఉచిత లావాదేవీల తర్వాత జరిపే క్యాష్, నాన్ క్యాష్ ఏటీఎం ట్రాన్సాక్షన్లపై చార్జీలు పెంచుకోవచ్చని తెలిపింది. జనవరి 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిపితే కొత్త ఏడాది నుంచి రూ.21 చార్జీ పడుతుందని తెలిపింది. దీనికి జీఎస్‌టీ వంటివి అదనం. ఇతర బ్యాంకులు కూడా ఇదే దారిలో నడిచే అవకాశముంది.
దేశంలోని బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చిన ఉచిత నెలవారీ పరిమితికి మించి ట్రాన్సక్షన్లు జరిపితే ATM లావాదేవీల ఛార్జీలను పెంచడానికి అనుమతించబడుతున్నాయని జూన్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ ధరల మార్పు జనవరి 1, 2022 నుండి అమలులోకి వస్తుంది. ఇంతకు ముందు జారీ చేసిన సర్క్యులర్‌లో, "అధిక ఇంటర్‌చేంజ్ రుసుమును బ్యాంకులకు భర్తీ చేయడానికి మరియు ఖర్చులలో సాధారణ పెరుగుదలను బట్టి, ప్రతి లావాదేవీకి కస్టమర్ ఛార్జీలను రూ. 21కి పెంచడానికి వారికి అనుమతి ఉంది" అని ఉంది. ఈ పెంపు జనవరి 1, 2022 నుండి అమలులోకి వస్తుంది. కాబట్టి ఉచిత ట్రాన్సాక్షన్ల విషయంలో ఓ కన్నేసి ఉంచడం చాలా బెటర్.
ఇక ఎస్బీఐ ఖాతాదారులు డబ్బులు విత్ డ్రా చేయడానికి కొత్త నిబంధన జారీ చేశారు. ఏ ఏటీఎంలోనైనా సరే రూ.10000 కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే OTP తప్పనిసరి. ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. దీనివల్ల మోసాలు తక్కువ జరిగే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం ఎస్బీఐ ఏటీఎంలకు మాత్రమే వర్తిస్తుంది. డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో బ్యాంకులో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ మీ వద్ద ఉండాలి. ఆ నెంబర్‌కి OTP వస్తుంది.. మీరు ఆ OTPని ఏటీఎం మిషన్‌లో టైప్ చేస్తే డబ్బు విత్‌డ్రా అవుతుంది. ఈ OTP ఆధారిత నగదు లావాదేవీలు 10 వేలకు పైబడిన మొత్తానికి మాత్రమేనని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటనలో తెలిపింది.