అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా తిరిగి చైనాకు వచ్చారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) సోమవారం నివేదించింది. దీంతో అలీబాబా కంపెనీ షేర్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. చైనాలో అత్యంత ప్రసిద్ధ వ్యాపారవేత్తలలో ఒకరైన మా, 2021 చివరలో చైనా ప్రధాన భూభాగాన్ని విడిచిపెట్టారు. ఆ తర్వాత జపాన్, ఆస్ట్రేలియా, థాయిలాండ్‌లలో కనిపించారు. చైనా ప్రభుత్వం గురి చేస్తున్న ఇబ్బందులను భరించలేక జాక్ మా చైనాను విడిచిపెట్టారనే ప్రచారం జరిగింది. అలీబాబా సంస్థ మార్కెట్ కూడా భారీ తగ్గింది.
బహిరంగంగా చైనా ప్రభుత్వం నియంత్రణ వ్యవస్థను విమర్శించి వార్తల్లో నిలిచారు. ఆ తరువాత ప్రభుత్వం అతడిని అణచివేసింది అనే ప్రచారం కూడా సాగింది. చైనా ప్రభుత్వం ఇటీవల తాము ప్రైవేట్ రంగానికి మద్దతు ఇచ్చే మార్గాలను అన్వేషిస్తామని చెప్పుకొచ్చారు. చైనా వ్యాపారవేత్తలు విదేశాలలో కాకుండా తమ దేశంలో ఉండాలని ప్రభుత్వ పెద్దలు కోరారు. దీంతో తాజాగా చైనాలో జాక్ మా కనిపించారు. ఆయన కంపెనీ అలీబాబా షేర్లు 4% కంటే ఎక్కువ పెరిగాయి.