ఎట్టకేలకు కనిపించాడు చైనా కుబేరుడు
Alibaba's Jack Ma makes first public appearance since October. చైనా వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు కనిపించాడు.
By Medi Samrat
చైనా వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు కనిపించారు. కొన్ని నెలల నుంచి కనిపించకుండా పోయిన జాక్ మా తాజాగా ఓ వీడియోలో కనిపించారు. గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారు సాధించిన విజయాలపైప్రశంసలు చేయడం వీడియోలో గమనించవచ్చు. గతంలో ఆయన ఇంగ్లిష్ టీచర్‌గాను పనిచేశారు. బుధవారం గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కనిపించారు. గ్రామీణ ప్రాంత అక్షరాస్యులు సాధించిన విజయాలను ప్రశంసించారు. తొలుత ఇంగ్లీష్ టీచర్‌గా పని చేసిన జాక్ మా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కోవిడ్ 19 కారణంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగింది. త్వరలోనే వచ్చి కలుస్తాను అని వారికి తెలిపారు.
జాక్ మా కనిపించకపోవడం ప్రపంచ వ్యాప్తంగా కొద్దిరోజుల కిందట సంచలనం అయింది. జాక్ మా మిస్సింగ్ అంటూ ప్రముఖ మీడియా సంస్థలు కథనాలను వెల్లడించాయి. జాక్ మా కొద్ది నెలల కిందట చైనా ప్రభుత్వానికి, ఆ దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే జాక్ మా పతనానికి కారణం అయ్యాయని అన్నారు. 2020 అక్టోబరులో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా మాట్లాడుతూ, చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల తరహాలో వ్యవహరిస్తున్నాయని విస్తృత స్థాయిలో ఆలోచించడం అలవర్చుకోవాలని సూచించారు. చైనా ఆర్థిక వ్యవస్థను కించ పరుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు జాక్ మా. జాక్ మా సంస్థలు, ఆర్థిక కార్యకలాపాలపై చైనా నిఘా వేసింది. జాక్ మా ఆస్తులు కూడా హరించుకుపోయాయి.