మరో రంగంలోకి అడుగు పెడుతున్న ఎయిర్‌టెల్‌

Airtel launches ad tech platform to tap $10 bln digital advertising market. టెలికం దిగ్గజం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ మరో

By Medi Samrat  Published on  26 Feb 2021 4:26 AM GMT
మరో రంగంలోకి అడుగు పెడుతున్న ఎయిర్‌టెల్‌

టెలికం దిగ్గజం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ మరో రంగంలోకి అడుగు పెట్టింది. ప్రకటన విభాగంలోకి అడుగు పెడుతూ యాడ్స్‌ను ప్రారంభించింది. అభివృద్ధి చెందుతున్న ప్రకటనల పరిశ్రమలో పట్టు సాధించేందుకు ఎయిర్‌ టెస్‌ చేస్తున్న ప్రయత్నమని కంపెనీ తెలిపింది. కంపెనీ డేటా సైన్స్‌, సామర్థ్యాలను ప్రభావితం చేస్తోంది. అయితే కాన్సెంట్‌ బెస్ట్‌, ప్రైవసీ సేఫ్‌ క్యాంపెయిన్‌ అందిచేందుకు బ్రాండ్లకు అనుమతి ఇస్తుంది. ఇది కేవలం తమ కస్టమర్లకు అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ల ప్రకటనను మాత్రమే అందిస్తుందని, ఆవాంచిత స్పామ్‌లను కాదని ఎయిర్‌టెల్‌ చీఫ్‌ ప్రోడక్ట్‌ ఆఫీసర్‌ ఆదర్శ్‌నాయర్‌ తెలిపారు.

అలాగే తాము క్వాంటిటీ కోసం కాకుండా క్వాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. ప్రకటనల వ్యాల్యూమ్‌ తక్కువ ఉన్నప్పటికీ, నాణ్యత ఎక్కువ ఉంటుందని చెప్పారు. కస్టమర్ల ప్రాధాన్యత, బ్రాండ్ల మధ్య సంబంధాలను ప్రకటనలతో కస్టమర్లను కోల్పోదని, వినియోగదారుల ప్రోఫైల్స్‌ను కోల్పోమని అన్నారు. ఎయిర్‌టెల్‌కి ప్రస్తుతం మొబైల్‌, డీటీహెచ్‌, హోమ్స్‌ వంటి వివిధ వ్యాపారాలకు సంబంధించి 320 మిలియన్ల మంది వినియోగదారులున్నారు.

ప్రస్తుతం ఎయిర్‌టెల్‌కు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రిలైల్‌, స్టోర్లున్నాయి. డిజిటల్‌ అవగాహన లేని కస్టమర్ల కోసం ఆయా ప్రాంతాల్లో హెల్త్‌ కవరేజ్‌, వీడియో సబ్‌స్క్రిప్షన్‌ తదితర ప్రకటనలు ఏమైనా చేయగలమా..? లేదా అనే దానిపై టెస్టింగ్‌ జరుగుతోందని తెలిపింది. త్వరలోనే రిలైల్‌, స్టోర్లలో ఈ ప్రకటనల యూనిట్లు కనిపించే అవకాశం ఉందని నాయర్‌ అన్నారు.


Next Story