కాల్పులను తిప్పికొట్టిన బీఎస్ఎఫ్
By Medi SamratPublished on : 13 Oct 2019 1:00 PM IST

జమ్ము కాశ్మీర్‌లోని హీరా నగర్ సెక్టార్ లో పాకిస్తాన్ రేంజర్లు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. జనావాసాలే టార్గెట్‌గా పాక్ రేంజర్లు ఈ కాల్పులు జరుపుతున్నారని.. బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా ఈ దాడులను తిప్పి కొట్టారని అధికారులు ప్రకటించారు.
ఇదిలావుంటే.. ఎల్ఓసీ వెంట పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది పాక్. కాల్పులు జరుగుతున్న వేళ పలువురు ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే ప్రయత్నాలు చేస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. సరిహద్దుల వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్.. ఈనెల రెండవ వారంలో ఒకవైపు దాడులకు పాల్పడుతూ.. మరోవైపు 300 మంది ఉగ్రవాదులను అక్రమంగా భారత్ లో చొరబడేలా చేస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు.
Next Story