బోడుప్పల్ కార్పొరేటర్‌పై కిడ్నాప్ కేసు.. అరెస్ట్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Sept 2020 4:11 PM IST
బోడుప్పల్ 6వ వార్డు కార్పోరేటర్ అజయ్ యాదవ్‌ని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాళ్లోకెళ్తే.. హరిపురి కాలనీకి చెందిన యారాసింగ్ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి కార్పోరేటర్ అజయ్ యాదవ్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈనెల 12న రాత్రి తన ఇంటికి వచ్చి బలవంతంగా కార్ లో తీసుకెళ్లి పలు చోట్ల తిప్పుతూ తనను కొట్టారంటూ.. దుర్గాప్రసాద్ చైతన్యపురి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కార్పోరేటర్ తో పాటు అతని స్నేహితులు మంగినపల్లి సాయికుమార్, చంద్రారెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో దుర్గాప్రసాద్ ని కిడ్నాప్ చేసి కొట్టినట్లుగా తెలుస్తుంది.
Next Story