మూగ మ‌హిళ‌ను న‌ర‌బ‌లి ఇచ్చేందుకు సిద్ద‌ప‌డ్డ బంధువులు.. అప్రమ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 May 2020 3:31 PM GMT
మూగ మ‌హిళ‌ను న‌ర‌బ‌లి ఇచ్చేందుకు సిద్ద‌ప‌డ్డ బంధువులు.. అప్రమ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో..

చిత్తూరు : ఈ రోజుల్లో మాన‌వ సంబంధాలంటే ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. డ‌బ్బు కోసం మ‌నిషి ప్రాణాన్ని తీయ‌డానికి కూడా వెనుకాడట్లేదు అంటే అర్థ‌మ‌వుతుంది.. జ‌నాలు ఏ స్థాయికి దిగ‌జారిపోయారో. లంకె బిందేలు, గుప్త నిధుల వేటలో ప‌డి క్షుద్ర పూజల కోసం మూగ మహిళను నరబలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఆ మ‌హిళ బంధువులు.

వివ‌రాళ్లోకెళితే.. చిత్తూరు జిల్లా కేంద్రంలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం వడ్డికండ్రిగ గ్రామంలో సరోజమ్మ (58) అనే మూగ మహిళకు డబ్బు ఆశ చూపించి నరబలి ఇచ్చేందుకు యత్నించారు. ఆమె స్వంత వదిన సుబ్బమ్మ, శేషాద్రిలు.. సరోజమ్మను వివ‌స్త్ర‌ను చేసి ప‌సుపు, కుంకుమ రాసి క‌త్తితో గొంతు కోసే ప్ర‌య‌త్నం చేయ‌గా.. స‌రోజ‌మ్మ‌ అప్రమత్తతో వ్య‌వ‌హ‌రించి ప్రాణాలు ద‌క్కించుకుంది. వెంట‌నే జ‌రిగిన‌ విష‌యాన్ని బెంగుళూరులో ఉన్న కొడుకుకు చేర‌వేసింది.

విష‌యం తెలియ‌డంతో సరోజమ్మ కొడుకు బెంగుళూరు నుండి స్వ‌గ్రామానికి హుటాహుటిన‌ చేరుకుని జ‌రిగిన ఘటనకు కారకులైన శేషాద్రి, సుబ్బమ్మలపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్ప‌డ్డ వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it