విరాట్ కోహ్లీ అనుష్కకు విడాకులు ఇచ్చేయాలని కోరుతున్న బీజేపీ నేత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 May 2020 3:55 AM GMT
విరాట్ కోహ్లీ అనుష్కకు విడాకులు ఇచ్చేయాలని కోరుతున్న బీజేపీ నేత

పాతాళ లోక్ వెబ్ సిరీస్ పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతల్లో ఒకరైన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యను తీవ్రంగా నిందిస్తున్న వాళ్లు కూడా కొందరు ఉన్నారు. తాజాగా ఓ బీజేపీ నేత అనుష్క శర్మకు విడాకులు ఇచ్చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ 'లోని' ప్రాంతానికి చెందిన నందకిషోర్ గుర్జార్ పాతాళలోక్ వెబ్ సిరీస్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పాతాళలోక్ వెబ్ సిరీస్ లో పలు కులాలను మతాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. అంతేకాకుండా అనుష్క శర్మ మీద పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను కూడా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.అక్కడితో ఆగని ఆయన హిందూ వ్యతిరేకి అయిన అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ విడాకులు ఇచ్చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు గురించి విన్న వాళ్లకు కాస్త కామెడీగా ఉండొచ్చు కానీ.. ఆయన మాత్రం చాలా సీరియస్ గానే విరాట్ కు ఆ సలహా ఇస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న విరాట్-అనుష్క జంట ఆయన వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇక సిక్కుల సెంటిమెంట్లకు వ్యతిరేకంగా ఈ వెబ్ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాబ్&హర్యానా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న జి.హెచ్.డిల్లాన్ అనే అడ్వొకేట్ పాతాళలోక్ వెబ్ సిరీస్ లో సిక్కుల మనోభావాలు దెబ్బ తినేలా సన్నివేశాలు ఉన్నాయని.. ఎస్.ఏ.ఎస్. నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Next Story
Share it