బెంగాల్ అక్రమ బాంబుల తయారీ కేంద్రంగా మారింది : గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sept 2020 7:26 PM IST
బెంగాల్ అక్రమ బాంబుల తయారీ కేంద్రంగా మారింది : గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పశ్చిమబెంగాల్ అక్రమ బాంబుల తయారీ కేంద్రంగా మారిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారుతోందని అన్నారు. శనివారం పశ్చిమబెంగాల‌్‌లోని ముర్షీదాబాద్, కేరళలోని ఎర్నాకులంలో అల్ ఖైదా కోసం ప‌నిచేస్తున్న‌ తొమ్మిది మందిని ఎన్ఐఏ అరెస్టు చేసిన నేపథ్యంలో గవర్నర్.. జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా అక్రమ బాంబుల తయారీ కేంద్రంగా రాష్ట్రం మారుతోందని. పోలీసులు, మమత బెన‌ర్జీ, అధికారులు రాజకీయ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ విపక్షాలను టార్గెట్ చేస్తున్నారని.. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు పోలీసులదే బాధ్యతని.. వారు తమ బాధ్యత నుంచి ఎంతమాత్రం తప్పించుకోలేరని ట్వీట్‌లో చేశారు.



వాస్తవాల నుంచి ఎంత కాలం డీజీపీ, పశ్చిమబెంగాల్ పోలీసులు దూరంగా జరుగుతున్నారని ధన్కర్ వ్యాఖ్యానించారు. సహజంగా పోలీసుల పాత్ర ప్రశంసనీయమే అయినప్పటికీ.. భిన్నమైన పరిస్థితుల్లో వారు పని చేస్తున్నారని అన్నారు.

Next Story