అమెరికాలో కాల్పుల కలకలం.. 12 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sep 2020 6:54 AM GMT
అమెరికాలో కాల్పుల కలకలం.. 12 మంది మృతి

అమెరికాలో కాల్పుల కలకల రేగింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రోచెస్టర్ లోని వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపారు. ఆ ప్రాంతమంతా రక్తసికమైంది. అమెరికా కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30కు ఈ కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి.

దేశంలో నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా రోచెస్టర్‌లో అర్థరాత్రి వరకు ఆందోళన కొనసాగాయి. ఈ ఆందోళన కొనసాగుతుండగానే కాల్పులు చెలరేగాయి.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల ఘటనకు పాల్పడింది ఒక్కరా..? లేక సమూహంగా పాల్పడ్డారా అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story