రష్యా కరోనా వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌‌..!

By సుభాష్  Published on  17 Sep 2020 9:42 AM GMT
రష్యా కరోనా వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌‌..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్నకరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు భారత్‌తో పాటు అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రష్యాకు చెందిన టీకా విజయవంతంగా తయారు చేశామని,దాని క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా పూర్తి అయ్యాయని ప్రకటించి వాటిని ప్రజలకు కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వీపై అందరూ ఎందరు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ కొంత మంది సైడ్‌ ఎఫెక్ట్‌ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఏడుగురిలో ఒకరు తమకు జ్వరం అని, ఒళ్లు నొప్పులు ఉన్నాయని రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్‌ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ సైడ్‌ ఎఫెక్ట్‌ తాము ఊహించినవేనని రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది. అవి కూడా ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇక మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి ఈ వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయగా, వారిలో 14 శాతం మంది స్వల్ప దుష్పలితాలు ఉన్నాయని పేర్కొంది.

ఇక భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ మూడో దశతో పరీక్షలతో పాటు పంపిణీకై హైదరాబాద్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, రష్యాన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్‌డీఐఎఫ్‌ సరఫరా చేయనుంది. అయితే రష్యా సరైన పరీక్షలు చేయకుండానే వ్యాక్సిన్‌ మార్కెట్లోకి తీసుకువస్తుందని ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు కూడా వచ్చాయి.

Next Story