బ్యాంక్‌లో 15 కేజీల బంగారం మాయం.. ఫ్రెండ్‌‌‌, గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌లిసి ఎంచ‌క్కా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2020 9:16 AM GMT
బ్యాంక్‌లో 15 కేజీల బంగారం మాయం.. ఫ్రెండ్‌‌‌, గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌లిసి ఎంచ‌క్కా..

బాధ్య‌తాయుతంగా ఉండాల్సిన ఉద్యోగి ధ‌నాపేక్ష‌తో ప‌క్క‌దారులు తొక్కాడు. ఉద్యోగ ధ‌ర్మాన్ని వీడి.. ప‌ని చేస్తున్న బ్యాంకులోనే క‌న్నం వేశాడు. వివరాళ్లోకెళితే.. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో ఎస్‌బీఐ బ్రాంచిలో 15 కిలోల బంగారం మాయ‌మైంది. గోల్డ్ లోన్ ‌లాక‌ర్ నుంచి 101 ప్యాకెట్ల బంగారు ఆభరణాలు(15 కిలోలు) మాయ‌మైనట్టు షియోపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచార‌ణ‌లో క్యాషియర్‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో క్యాషియ‌ర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు త‌మ‌దైన స్టైల్లో విచారించ‌గా.. క్యాషియ‌ర్‌ త‌న స్నేహితుడు నవీన్, గ‌ర్ల్‌ ఫ్రెండ్‌ జ్యోతిల‌తో క‌ల‌సి ఈ చోరీ చేసినట్లు తేలింది. ఈ కేసులో పోలీసులు మిగిలిన ఇద్ద‌రు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. వారి వ‌ద్ద నుండి మూడు కేజీల‌ బంగారం, రూ. 11 లక్షల న‌గ‌దును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Aaj

Next Story
Share it