బాల‌య్య 'రూల‌ర్' టీజ‌ర్ టాక్ ఏంటి..?

By Medi Samrat  Published on  22 Nov 2019 4:30 PM IST
బాల‌య్య రూల‌ర్ టీజ‌ర్ టాక్ ఏంటి..?

ముఖ్యాంశాలు

  • బాల‌య్య‌, కె.ఎస్.ర‌వికుమార్, సి.క‌ళ్యాణ్ కాంబినేషన్లో రెండో సినిమా
  • ప‌వ‌ర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ
  • బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్

నందమూరి బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్ ల కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం రూల‌ర్. సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాల‌య్య‌, కె.ఎస్.ర‌వికుమార్, సి.క‌ళ్యాణ్ ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన జైసింహా సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో, రూలర్ పై నందమూరి అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసిన సినిమా యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది.

ధర్మ అనే ప‌వ‌ర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ టీజర్ లో అదరగొట్టారు అనే చెప్పాలి. డైలాగ్స్, యాక్షన్ అండ్ ఫైట్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్టన్నింగ్ విజువల్స్ తో దుమ్మురేపిన ఈ టీజర్, ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ‘ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ ఉంటే బోనులో సింహంలా కామ్ గా ఉంటాను. అదే యూనిఫామ్ తీసేస్తే బయటకొచ్చిన సింహంలా ఆగను…ఇక వేటే’ అంటూ బాలకృష్ణ పలికిన పవర్ ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సికె ఎటెర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ బ్యానర్లపై సి కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. రూల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తాడో..?

Next Story