ఏపీలో భారీగా వర్షాలు.. తెలంగాణలో మోస్తరు

నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఇండియన్‌ మెట్రోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది.

By అంజి  Published on  19 March 2024 6:28 AM IST
imd, moderate rains, Telangana, AndhraPradesh,rains

ఏపీలో భారీగా వర్షాలు.. తెలంగాణలో మోస్తరు 

నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఇండియన్‌ మెట్రోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల వాన పడే ఛాన్స్ ఉందంటున్నారు. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండనుంది. అల్లూరి సీతారామజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.

అటు తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 24 గంటల్లో గ్రేటర్‌లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో ఈ నెల 21 ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. మరో వైపు పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. కోతకొచ్చిన ధాన్యం నేల రాలుతోంది.

Next Story