దిన ఫలితాలు : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి

చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ద పెరుగుతుంది.

By జ్యోత్స్న  Published on  23 Nov 2024 5:58 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి

మేషం:

చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ద పెరుగుతుంది. దూరపు బంధువులు నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆప్తులతో శుభకార్యా విషయాల గూర్చిచర్చిస్తారు. వృత్తి, ఉద్యోగ విషయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

వృషభం:

సంతాన ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. బంధు మిత్రుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు.

మిధునం:

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. సంతానం విద్యా విషయాలలో అసంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

కర్కాటకం:

వ్యాపార వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి.

సింహం:

కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. అనవసర వ్యవహారాలలో ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.

కన్య:

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారాలలో నూతన అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల:

చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలసిరావు. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్ధిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

వృశ్చికం:

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. పాత మిత్రులను కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున మరింత ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

ధనస్సు:

కుటుంబ సభ్యులు నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో కీలక విషయాల గూర్చి చెర్చిస్తారు. పాత మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగయోగమున్నది.

మకరం:

కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. ఇంటాబయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొత్త వ్యాపారాలు నిరుత్సహ పరుస్తాయి ఉద్యోగాలలో పనిభారం అధికమౌతుంది.

కుంభం:

చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు చికాకు కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

దిన ఫలితాలు : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధన విషయంలో అనుకూలత కలుగుతుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాల సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో అనుకూలిస్తాయి. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

Next Story