దిన ఫలితాలు : ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు

చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

By జ్యోత్స్న  Published on  16 Nov 2024 6:15 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు

మేషం:

చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అభివృద్ధి పాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు.

వృషభం:

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

మిధునం:

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట పనిఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.

కర్కాటకం:

కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

సింహం:

బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

కన్య:

కుటుంబ సభ్యుల నుండి అవసరానికి తన సహాయం అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాల కలసివస్తాయి. వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

తుల:

నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు కలుగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం:

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. గృహమునకు బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు:

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభ సాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మకరం:

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కుంభం:

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూరపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి.

మీనం:

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయటా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది.

Next Story