దిన ఫలితాలు : ఆ రాశి వారు చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి

కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి.

By Medi Samrat  Published on  27 Jun 2024 7:19 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి

మేషం:

కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం:

బంధు మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలు కుటుంబ వాతావరణం గందరగోళంగ ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

మిధునం:

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందవు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి.

కర్కాటకం:

సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆలోచనలు కలసి వస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి.

సింహం:

సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

కన్య:

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల:

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సోదరులకు స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారములలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృశ్చికం:

గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు.

ధనస్సు:

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహమున సంతాన వివాహా ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిఅవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు.

కుంభం:

గృహము శుభకార్యాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం:

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారములు అంతగా రాణించవు. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

Next Story