దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు

కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on  28 Dec 2024 6:43 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు

మేషం:

కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. చాలకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

వృషభం:

ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మిధునం:

ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు.

కర్కాటకం:

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాలు విషయంలో అనుకూలత కలుగుతుంది.

సింహం:

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారులు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. భూ సంబంధిత వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. మానసిక చికాకులు పెరుగుతాయి.

కన్య:

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వృద్ధి, పాత ఋణాలు తీర్చాగలుగుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల:

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. ఉద్యోగమున అధికారులతో వాదాలకు వెళ్లకపోవడం మంచిది. పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చికం:

కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు:

మొండి బాకీలు వసూలవుతాయి. సంఘంలో ప్రముఖుల ఆధరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికామౌతుంది. నూతన ఋణ యత్నాలు కలసిరావు.

కుంభం:

చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో కాని పూర్తికావు. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

మీనం:

వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారమౌతాయి. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడతాయి. వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి.

Next Story