తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యా : అసదుద్దీన్ ఓవైసీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Aug 2020 11:58 AM GMT
తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యా : అసదుద్దీన్ ఓవైసీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు హాజరుకావడాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పు పట్టారు. పదవీ స్వీకారంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు కట్టుబడి ఉంటానని చేసిన ప్రమాణాన్ని మోదీ ధిక్కరించారని అన్నారు.

పునాది రాయి వేసిన అనంతరం తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనాయనన్న ప్రధాని వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఓవైసీ.. ఈ దేశ పౌరుడిగా తాను కూడా అంతే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు. ఈరోజు ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఓడిపోయి హిందుత్వం గెలిచింది. ప్రధానమంత్రి తన ప్రమాణ స్వీకారాన్ని ధిక్కరించి రామ మందిరానికి పునాది రాయి వేశారు. లౌకిక దేశమైన ఇండియాలో ఇలాంటివి జరగడమేంటని ప్ర‌శ్నించారు.

దేశ ప్రధానికి ఏ ఒక్క మతంపై ప్రేమ ఉండకూడని.. ప్రధాని మోదీ హిందుత్వవాదానికి పునాది వేశారని విమర్శించారు. ఒక మందిరం కానీ, ఒక మసీదు కానీ దేశానికి ప్రతీక కాబోవన్నారు. కాగా, అంతకు ముందు ట్వీటర్‌ వేదికగా కూడా బీజేపీ ప్రభుత్వంపై ఒవైసీ మండిపడ్డారు. ‘బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, కచ్చితంగా ఉంటుంది’అనే అర్థం వచ్చేలా బాబ్రీ జిందా హై అనే హ్యాష్‌ట్యాగ్స్‌‌తో ట్వీట్‌ చేశారు.

Next Story
Share it