ఏపీలో మందుబాబులకు శుభవార్త.. మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చు
By తోట వంశీ కుమార్ Published on 2 Sept 2020 11:40 AM ISTఏపీలో మందుబాబులకు శుభవార్త ఇది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. మద్యపాన విషయంలో ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. లిక్కర్ ధరలను భారీగా పెంచి మద్యం దుకాణాలను సైతం తగ్గించేసింది. మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఇంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ఏపీకి రాకుండా మరింత కఠిన చర్యలు చేపడుతోంది.
ఏపీలో బ్రాండెడ్ మద్యం దొరకని కారణంగా.. మందు ప్రియులు సరిహద్దు రాష్ట్రాల వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే.. వాటిని రాష్ట్రంలో తీసుకురావడం నిషేదం ఉంది. ఇప్పటి వరకు ఒక్క మద్యం బాటిట్‌తో ప్రయాణం చేసినా పోలీసులు పట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. జీవో నెంబర్ 411 ప్రకారం మూడు మద్యం బాటిల్స్ తీసుకుని రావొచ్చని హైకోర్టు చెప్పింది. ఈ జీవోను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు సూచించింది.కాగా.. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మూడు మద్యం బాటిళ్లు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది.