ఏప్రిల్‌ 1న పెన్షన్లు డోర్‌ డెలివరీ

By అంజి  Published on  29 March 2020 6:13 AM IST
ఏప్రిల్‌ 1న పెన్షన్లు డోర్‌ డెలివరీ

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ వస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ ఒక్కొక్కటిగా నేరవెరుస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో చాలా మంది నిరు పేదలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారికి బాసటగా సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిలుస్తోంది. ఎప్రిల్‌ 1వ తేదీన పెన్షన్లు పంపిణీకి సిద్ధమవుతోంది. వృద్ధులు, వితంతువుల, దివ్యాంగులు సహా లబ్దిదారులందరకీ పెన్షన్లు ఇవ్వాడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ వాలంటీర్లు పెన్షన్లను డోర్‌ డెలివరీ చేయనున్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెన్షన్ల పంపిణీపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రతి నిరుపేద కుటుంబానికి ఏప్రిల్‌ 4వ తేదీన రూ.1000 ఆర్థిక సాయం చేయనున్నారు. దీనిని కూడా వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు.

Also Read: ఏపీలో 19, తెలంగాణలో 67 కరోనా కేసులు..

సమీక్షలో.. పేదలకు ఆహార భద్రతలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం

లాక్‌డౌన్‌ కారణంగా పేద ప్రజలకు మూడు సార్లు ఉచితంగా రేషన్‌ సరుకులను అందించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేయనున్నారు. రెండో విడతగా ఏప్రిల్‌ 15న, మూడో విడతగా ఏప్రిల్‌ 29న ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకం కొన్ని కుటుంబాలకే వర్తిస్తోందని.. అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుటుంబాలకు రేషన్‌ బియ్యం, కంది పప్పు అందించి, అదనపు భారం మోయాలని నిర్ణయించిందని సీఎం జగన్‌ అన్నారు.

Next Story