ఏపీలో వాలంటీర్ల పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2020 8:16 PM IST
ఏపీలో వాలంటీర్ల పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి ప్రభుత్వం నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే ‌వేల సంఖ్యలో గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేసిన ప్ర‌భుత్వం మ‌రోసారి వాలంటీర్ల పోస్టుల భ‌ర్తీకి నోటీఫికేష‌న్‌ను జారీ చేసింది. ఇదివ‌ర‌కు ఉన్న వాలంటీర్ల‌లో కొంద‌రు.. విధుల‌కు గైర్హాజరు కావడం, కొందరు విధులు నిర్వహించకపోవడం, మరికొందరు ఉద్యోగానికి రాజీనామా చేయడంతో చాలా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి.

ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో ఇంటింటికి తిరిగి ప్ర‌జ‌ల‌కు సేవ‌ల్ని అందించ‌డంలో వాలంటీర్లు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను కూడా.. భ‌ర్తీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తాజాగా.. 10,700 వాలంటీర్ల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తే నోటీఫికేష‌న్ రిలీజ్ చేసింది. అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

  • ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకున్న అభ్య‌ర్థి వ‌య‌సు 01.01.2020 నాట‌కి 18 నుండి 35 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
  • గిరిజన ప్రాంతాల్లోని అభ్యర్దులు 10వ తరగతి ,గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్దులు ఇంటర్మీడియట్ , పట్టణ ప్రాంతాల్లోని అభ్యర్ధులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ధరఖాస్తు చేయువారు సంబంధిత గ్రామపంచాయితీ లేదా మున్సిపలిటీ పరిధిలో నివాసస్థుడై ఉండాలి.
  • అర్హులైన వారు https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ నుందు ధరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - 24 ఏప్రిల్ 2020.
  • దరఖాస్తుల పరిశీలన - 25, ఏప్రిల్ 2020
  • ఇంటర్వ్యూ - 27 ఏప్రిల్ నుంచి 29 ఏప్రిల్ 2020
  • ఎంపికైన వారికి సమాచారం - ఏప్రిల్ 27 నుంచి 29 ఏప్రిల్ 2020
  • ఎన్నికైన వారు విధుల్లో చేరాల్సిన తేది - 1 మే 2020

కోవిడ్-19 లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేయుటకు అవకాశం లేని వారు సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయ కార్యాలయమును సంప్రదించి, అక్కడ సిబ్బంది సహయంతో ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోగలరు.

Next Story