నిరుద్యోగులకు శుభవార్త..టీసీఎస్ లో 40 వేల ఉద్యోగాలు

By రాణి  Published on  17 April 2020 4:28 PM GMT
నిరుద్యోగులకు శుభవార్త..టీసీఎస్ లో 40 వేల ఉద్యోగాలు

దేశంలో కరోనా ప్రభావంతో ఆర్థిక సంక్షోభమే కాదు..నిరుద్యోగం కూడా పెరిగింది. వందల కంపెనీలు వేల ఉద్యోగులను తీసేయడంతో దేశంలో నిరుద్యోగ శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం ఫ్రెషర్ల కోసం 40 వేల ఉద్యోగాలివ్వనుంది. అలాగే టీసీఎస్ సంస్థ నుంచి ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించడం లేదని, అసత్య ప్రచారాలను నమొద్దని టీసీఎస్ ఎండీ, సీఈవో రాజేశ్‌ గోపీనాథ్‌ తెలిపారు.

చూసే వారికి అది చాలా తేలికే..కానీ చేసే వారికే చాలాకష్టమంటున్న ఉపాసన

2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియగా సంస్థ లాభాల బాటలోనే ఉందన్న టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో మాత్రం ఫలితాలు అనుకూలంగా ఉండేలా కనిపించడం లేదని పేర్కొంది. అలాగే జూన్ లో కాలేజీలు, యూనివర్శిటీలు ముగిసిన అనంతరం కంపెనీలోకి 40 వేల ఫ్రెషర్లను ఆహ్వానించనున్న నేపథ్యంలో కంపెనీలోని ఉద్యోగులెవ్వరికీ జీతాల పెంపు ఉండదని స్పష్టంచేశారు. 2018 -19 ఆర్థిక సంవత్సరం టీసీఎస్ నికర లాభం రూ.8,126 కోట్లుండగా..ఈ ఏడాది రూ.8049 నికర లాభం నమోదైందన్నారు.

ఆమె పై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయండి ప్లీజ్..

Next Story