కోవిడ్-19 హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి వివ‌రాలు తెలుసుకోండిలా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 2:49 AM GMT
కోవిడ్-19 హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి వివ‌రాలు తెలుసుకోండిలా..

కోవిడ్-19 నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు 8297104104 హెల్ప్ లైన్ నంబర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ నంబర్ కు కాల్ చేసినపుడు మూడు ఆప్షన్లు వస్తాయి.

1వ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే కోవిడ్ సంబంధిత సమాచారం (కోవిడ్ లక్షణాలు కలిగి ఉండడం, కోవిడ్ పరీక్ష చేయించుకోవడానికి, ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే హోమ్ ఐసోలేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చినపుడు, కోవిడ్ పరీక్ష ఫలితం కోసం ఎదురుచూస్తున్నట్టయితే),

2వ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే కోవిడ్ సంబంధిత వైద్య సహాయం (పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ ఎంచుకున్నవారు, పాజిటివ్ వచ్చినవారు కోవిడ్ కేర్ సెంటర్లో చేరడం కోసం, కోవిడ్ ఆస్పత్రిలో చేరడానికి, కోవిడ్ పాజిటివ్ వచ్చి అంబులెన్స్ సాయం కోసం, కోవిడ్ సంబంధిత ఫిర్యాదుల కోసం),

3వ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే కోవిడ్ సంబంధిత వివిధ సమాచార సాధనాల గురించి ( కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ మొబైల్ యాప్ కొరకు, వాట్సాప్ చాట్ బాట్, కోవిడ్ వైబ్ సైట్ కోసం, వైఎస్ఆర్ టెలీమెడిసిన్ కొరకు, 104 కాల్ సెంటర్ కోసం) తెలుసుకోవచ్చు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని వివరించడంతోపాటు కోవిడ్ కు సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా తీర్చుకోవచ్చు.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా భౌతిక దూరం పాటించకుండా, చేతులు శుభ్రం చేసుకోకుండా, మాస్కు ధరించి కుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నట్లయితే వీధిలో ఉన్న కొరోనాను ఇంట్లోకి ఒంట్లోకి ఆహ్వానించినట్లే.. ఇంట్లో క్షేమంగా కుటుంబ సభ్యులతో ఉండాల్సిన బదులు ఇబ్బందులతో ఆసుపత్రుల చుట్టూ ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది.

Next Story