హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జ‌గ‌న్ భేటీ

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 22 Sept 2020 7:38 PM IST

హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జ‌గ‌న్ భేటీ

ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో సీఎం జగన్‌ ఆయన్ను కలిశారు. విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కొవిడ్‌ సహా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధుల అంశాలను అమిత్‌షాకు సీఎం వివరిస్తున్నట్లు సమాచారం.

ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజధాని విషయంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ల అంశంపైనా నేతలిద్దరూ చర్చిస్తున్నట్లు సమాచారం.

ఈ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. సీఎం జగన్‌ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story