రాజధాని భూ కుంభకోణం విచారణలో సిట్ దూకుడు పెంచింది. రాజధాని ప్రాంతం లంక భూముల్లో అవకతవకలకు పాల్పడ్డవారిపై సిట్ కొరడా జులిపిస్తుంది. ఇందులో భాగంగా ఇద్దరు కీలక వ్యక్తులను సిట్‌ బుధవారం అదుపులోకి తీసుకుంది. తుళ్లూరు రిటైర్డ్ ఎమ్మార్వో సుధీర్ బాబు, విజయవాడకు చెందిన ప్రముఖ రియల్టర్ గుమ్మడి సురేష్‌ను సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గత ప్రభుత్వంలో వేలాది ఎకరాల అసైన్డ్, లంక భూముల్లో అవకతవకలపై సుధీర్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేఫ‌థ్యంలో సుధీర్ ‌బాబును పోలీసులు అరెస్టు చేశారు. ఇక‌ అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసిన గుమ్మడి సురేష్ అనే వ్యక్తిని సైతం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన సురేష్.. దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్‌ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

వీరిద్దరిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో సురేశ్‌, సుధీర్‌ బాబును గుంటూరు జైలుకు తరలించారు. ఇదిలావుంటే.. తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారన్న ఆరోపణలపై సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని పోలీసులు ఇదివ‌ర‌కే అరెస్టు చేశారు.

సామ్రాట్

Next Story