విశాఖలో కేబినెట్‌ భేటీ లేనట్లేనా..!

By Newsmeter.Network  Published on  25 Dec 2019 10:10 AM IST
విశాఖలో కేబినెట్‌ భేటీ లేనట్లేనా..!

ముఖ్యాంశాలు

  • సమయాభావం వల్ల కేబినెట్‌ భేటీ ఏర్పాట్లు కష్టమేనని తేల్చిన అధికారుల
  • వెలగపూడిలోనే నిర్వహించాలని నిర్ణయం
  • అమరావతిలో ఆందోళనల నేపథ్యంలో విశాఖలో నిర్వహించాలని భావించిన అధికారులు
  • జీఎన్ రావు కమిటీ నివేదికకు ఆమోదం తెలపనున్న కేబినెట్
  • అమరావతి రైతులకు వరాలు ప్రకటించనున్న కేబినెట
  • సీఎం జగన్ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి

అమరావతి: విశాఖలో ఈ నెల 27న ఏపీ కేబినెట్‌ భేటీ లేనట్లేనని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సమయాభావం వల్ల విశాఖలో కేబినెట్‌ భేటీ ఏర్పాట్లు కష్టమేనని అధికారులు తేల్చారు. వెలగపూడిలోనే రాష్ట్ర కేబినెట్‌ నిర్వహించాలని నిర్ణయం జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట అమరావతిలో ఆందోళనల నేపథ్యంలో కేబినెట్‌ భేటీని విశాఖలో నిర్వహించాలని అధికారులు భావివంచారు. కాగా వెలగపూడిలోనే కేబినెట్‌ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని సమాచారం. చివరి నిమిషంలో మార్పుతో ఇబ్బందులు ఎదురవుతాయనే భావనలో అధికారలు ఉన్నారు.

ఎల్లుండి జరగబోయే కేబినెట్‌ భేటీలో మూడు రాజధానులపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా కేబినెట్‌లో మూడు రాజధానుల అంశంపైనే చర్చింనున్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదికకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే కేబినెట్‌ భేటీ తర్వాత అమరావతి రైతులకు సీఎం జగన్‌ వరాలు ప్రకటించే ఛాన్స్‌లు ఉన్నాయి. కాగా సీఎం జగన్‌ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏపీ కార్యనిర్వహక రాజధాని భీమిలిలో కాదని.. భీమిలి నియోజకవర్గంలో ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఎల్లుండి జరగబోయే కేబినెట్‌ భేటీలో సృష్టత వస్తుందన్నారు.

రాజధాని మార్పు చేస్తున్నామని వైసీపీ సర్కార్‌ రాక్షస క్రీడ ఆడుతోందని మాజీ ఎంపీ సబ్బం హరి ఫైర్‌ అయ్యారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృవద్ధి చెందదని.. పెట్టుబడిదారులు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తే అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖను రాజధాని కేంద్రంగా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందతుందన్న మంత్రి బొత్సతో తాను బహిరంగ చర్చకు సిద్ధమని సబ్బం హరి అన్నారు. భీమిలిలో ఉన్న భూములను దోచుకోవడానికే రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకోచ్చారని ఆరోపించారు.

మూడు రాజధానులకు తాము వ్యతిరేకమంటూ అమరావతి రైతులు చేస్తున్న ధర్నాలు ఏనిమిదో రోజుకు చేరుకున్నాయి. రాజధానులు ప్రకటనకు వెనక్కి తీసుకోవాలని అమరావతి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం ఛాన్స్‌ దొరికినప్పుడల్లా ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అమరావతి రావాడానికి సీఎం జగన్‌ భయపడుతున్నారని.. అందుకే రాజధానిని విశాఖకు మార్చాలంటూ ప్రకటన చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story